కుటుంబ కథా చిత్రాలకు చిరునామాగా నిలచిన కథానాయకుల్లో శోభన్‌బాబు ఒకరు. అలా శోభన్‌బాబు నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించాయి. వాటిలో ‘కార్తీకదీపం’ ఒకటి. శోభన్‌బాబు, శ్రీదేవి, శారద నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. గీత కీలక పాత్రలో నటించగా గుమ్మడి, ప్రభాకర రెడ్డి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, రమాప్రభ తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సత్యం స్వర సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా “ఆరనీకుమా ఈ దీపం”, “చిలకమ్మా పలికింది”, “నీ కౌగిలిలో తలదాచి” వంటి పాటలు ఎవర్‌గ్రీన్ సాంగ్స్‌గా నిలిచాయి. 1979 మే 10న విడుదలైన కార్తీకదీపం
… నేటితో 40 వసంతాలను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘కార్తీకదీపం’ – కొన్ని విశేషాలు:
- శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించిన తొలి చిత్రమిదే కావడం విశేషం. అంతకుమందు శోభన్ నటించిన పలు చిత్రాల్లో బాలనటిగా అలరించిన శ్రీదేవి…
కార్తీకదీపం
కంటే రెండు నెలలు ముందు విడుదలైనబంగారు చెల్లెలు
లో చెల్లెలుగా నటించింది.బంగారు చెల్లెలు
,కార్తీకదీపం
… రెండూ కూడా విజయం సాధించడం విశేషం. - శోభన్‌బాబుకు ఉత్తమ నటుడిగా నాలుగో సారి ఫిలింఫేర్ అవార్డును అందించిన చిత్రమిది. అంతకు ముందు ‘ఖైదీ బాబాయ్’ (1974), ‘జీవనజ్యోతి’ (1975), ‘సోగ్గాడు’(1976) చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌లను సొంతం చేసుకున్నాడు శోభన్‌బాబు.
- ఈ చిత్రాన్ని హిందీలో ‘మాంగ్ భరో సజనా’ పేరుతోనూ… కన్నడంలో ‘సౌభాగ్యలక్ష్మి’ పేరుతోనూ రీమేక్ చేసారు. అన్ని భాషల్లోనూ సంగీతానికి పెద్ద పీట వేయడం విశేషం. హిందీ రీమేక్ ‘మాంగ్ భరో సజనా’కు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం అందించగా… కన్నడ చిత్రం ‘సౌభాగ్యలక్ష్మి’కి గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం స్వరాలు సమకూర్చడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: