స్పోర్ట్స్ నేపథ్య మూవీ లో ఆది పినిశెట్టి

Aadhi Pinisetty Turns Athlete For His Next

భారతీయ చిత్ర పరిశ్రమలో స్పోర్ట్స్ నేపథ్యంలో మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యం లో రూపొందిన నాగ చైతన్య మజిలీ, నాని జెర్సీ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఆది పినిశెట్టి రన్నింగ్ క్రీడాకారుడిగా నటించనున్నారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వం లో తెలుగు, తమిళ భాషలలో రూపొందే స్పోర్ట్స్ డ్రామా మూవీ కి ఆది పినిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన కలను నెర వేర్చుకొనడానికి ఎదురైన అడ్డంకులను హీరో ఎలా అధిగమించాడు అనేది చిత్ర కథ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక V చిత్రం మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయమైన ఆది పినిశెట్టి, కోలీవుడ్ లో హీరోగా సెటిల్ అయ్యారు. తెలుగు లోఆది పినిశెట్టి సూపర్ హిట్ నిన్నుకోరి, సరైనోడు, రంగస్థలం వంటి మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.ఆది పినిశెట్టి మాట్లాడుతూ .. ఈ మూవీ లో రన్నింగ్ క్రీడాకారుడిగా నటిస్తున్నానని, ఇంటర్ నేషనల్ లెవెల్ లో రన్నర్ గా మారడానికి పడే ఇబ్బందులు ఈ మూవీ కథని, ఒక రన్నర్ నిజ జీవితం ఆధారంగా రూపొందనున్న ఈమూవీ ఎమోషనల్ గా సాగుతుందని, స్పోర్ట్స్ లో జరిగే రాజకీయాలు కూడా ఉంటాయని అన్నారు. రెండు డిఫరెంట్ లుక్స్ లో కనపడతాయని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో లుక్ గురించి 9కేజీలు వెయిట్ తగ్గానని, ప్రస్తుత క్రీడాకారుడిగా ఇంకొక లుక్ ఉంటుందని, త్వరలోనే ఒక అథ్లెటిక్ ఛాంపియన్ ను కలసి ఈ మూవీ కై ట్రైనింగ్ తీసుకుంటానని ఆది తెలిపారు.

[subscribe]
[youtube_video videoid=YbE-qNxkBuA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − seven =