ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇలా పాత తరం కథానాయకులు ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు తీసి సంచలన విజయాలు సాధించారు. అయితే వారి తరం వచ్చిన నాయకుల్లో మళ్లీ మల్టీస్టారర్లకు ప్రాణం పోసిందంటే విక్టరీ వెంకటేష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ మాత్రం సంకోచించకుండా మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మల్టీస్టారర్ సినిమా తీసి మరోసారి మల్టీస్టారర్ సినిమాలను గుర్తు చేశాడు. ఇక ఆ తరువాత ఇప్పుడు మళ్లీ అందరూ అదే బాట పట్టారనుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు మళ్లీ వెంకీ మరో మల్టీస్టారర్ సినిమాకు శ్రీకారం చుట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి. తమిళ్ లో విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా తెరకెక్కిన ‘విక్రమ్ వేద’ గుర్తుండే ఉంటుంది కదా. 2017లో విడుదలైన ఈ సినిమా తమిళనాట ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు… తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్రను వెంకటేష్ పోషించనుండగా… మాధవన్ పాత్రలో నారా రోహిత్ నటించనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెంకీ బ్రదర్ సురేష్ బాబు ఇచ్చిన ప్రకటన చూస్తే అర్థమవుతోంది. విక్రమ్ వేద రీమేక్ లో వెంకీ నటిస్తున్నట్టు పలు వార్తలు వస్తున్నాయి… అందులో ఎలాంటి నిజం లేదు.. తను ప్రస్తుతం వెంకీ మామ అనే మల్టీస్టారర్ మాత్రమే చేస్తున్నాడు.. త్వరలోనే తను చేయబోయే అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి తెలుపుతాడని సురేష్ బాబు అధికారికంగా ప్రకటించారు.
[subscribe]
[youtube_video videoid=N6vxER5O9Bk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: