స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో సైరా నరసింహా రెడ్డి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్సింగ్ పరిధి లో చిరంజీవి ఫామ్ హౌస్ లో సైరా మూవీ కై ప్రత్యేక సెట్ ను రూపొందించారు. గురువారం రాత్రి వరకు షూటింగ్ జరిగిందని, శుక్రవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణం గా అగ్నిప్రమాదం జరిగిందని , అగ్ని ప్రమాదం లో సెట్ దాదాపు కాలిపోయినట్టు, 2కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సైరా మూవీ కి అమిత్ త్రివేది సంగీతం అందించారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా మూవీ తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. సైరా మూవీ షూటింగ్ ముగింపు దశ లో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటుంది.సైరా మూవీ పై ప్రేక్షకులకు, మెగా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి
[subscribe]
[youtube_video videoid=qqwQveU3DHA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: