‘ఆర్ ఎక్స్ 100’… ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆ సినిమాలో ఎంతో బోల్డ్‌గా నటించిన కథానాయిక పాయల్ రాజ్‌పుత్. మొదటి చిత్రంతోనే మెస్మరైజ్ చేసిన ఈ భామ… ఇప్పుడు మరో విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీలో నటిస్తోంది. అదే… ‘RDX లవ్’. అయితే… ‘ఆర్ ఎక్స్ 100’ టైటిల్‌కి దగ్గరగా ఈ సినిమా టైటిల్ కూడా ఉండడంతో… ఈ కొత్త చిత్రం ‘ఆర్ ఎక్స్ 100’కి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో… తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది పాయల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఆర్ ఎక్స్ 100’కి ఈ సినిమా సీక్వెల్ కాదని, ఈ రెండు చిత్రాలకి ఏ మాత్రం సంబంధం లేదని… ఇదొక సోషల్ కాజ్‌తో తెరకెక్కుతున్న ఫిమేల్-సెంట్రిక్ ఫిలిమ్ అని వెల్లడించింది పాయల్. అంతేకాదు… ఇదొక డిఫరెంట్ జానర్ మూవీ అని, స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చింది. కాగా… ఈ సినిమాలో ‘హుషారు’ ఫేమ్ తేజూస్ కంచర్ల హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం రామచంద్రాపురంలో ఆఖరి షెడ్యూల్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రానికి భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా… జూన్ లేదా జూలై నెలలో ప్రేక్షకుల రానుంది.
ఈ సినిమాతో పాటు… విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’లో వెంకీ సరసన కథానాయికగా నటిస్తోంది పాయల్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ దసరా సీజన్‌లో రిలీజ్ కానుంది.
[subscribe]
[youtube_video videoid=3I7Gb8wRFQk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: