తమిళ సినిమా ‘గోలి సోడా’కు రీమేక్ గా తెలుగులో వస్తున్న సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. తెలుగులో రీమేక్ చేస్తున్న ఈసినిమాతో ‘రేసుగుర్రం’, ‘పటాస్’, ‘రుద్రమదేవి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో ఆర్టిస్టుగా నటించిన సహిదేవ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ‘ఎవడు తక్కువ కాదు’. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మే 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యాక్షన్‌తో పాటు టీనేజ్ ప్రేమకథతో రూపొందుతోన్న ఈసినిమాలో విక్రమ్ సహిదేవ్ కు జోడిగా ప్రియాంక జైన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో ఆర్కే, తార, మధు సూదన్, రఘు కారుమంచి తదితరులు నటిస్తున్నారు. సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు.
మరి తమిళ్ లో ‘గోలి సోడా’ సినిమా సూపర్ హిట్టయింది. అంతేకాదు అప్పట్లో ఈసినిమా చూసిన స్టార్ హీరోయిన్ సమంత కూడా ‘గోలి సోడా’ పై ప్రశంసలు కురిపించింది. అలాంటి ఈసినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుంది. మరి ఈసినిమా ఇక్కడ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=NAeEiCr4O5k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: