ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా ప్రారంభం అయిన దగ్గరనుండి రోజుకో వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. రూమర్లు మరీ ఎక్కువవుతున్న నేపథ్యంలో… చిత్రయూనిట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చింది. ఆ తరువాత ఈ రూమర్లకు కాస్త బ్రేక్ పడినా.. మళ్లీ ఏదో ఒక విషయంలో రోజుకో గాసిప్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ పక్కన సెలక్ట్ చేసిన హాలీవుడ్ నటి తప్పుకోవడంతో… అప్పుడే ఎన్టీఆర్ సరసన ఇద్దరు నాయికలు కనిపించనున్నారని.. అందులో ఒక నాయికగా నిత్యామీనన్ నటిస్తుందని.. ఓగిరిజన పాత్ర పోషిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమాలో తమిళ టాలెంటెడ్ నటుడు సముద్రఖని కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆయన ఎన్టీఆర్ బాబాయ్ గా కనిపించనున్నాడని అంటున్నారు. అంటే కొమరం భీమ్ కి బాబాయ్ పాత్రను పోషించనున్నాడన్న మాట. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమనీ, అందుకే ఆయనను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి వీటన్నిపై క్లారిటీ రావాలంటే మరోసారి ప్రెస్ మీట్ పెట్టాలమే రాజమౌళి.
కాగా స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న విడుదలకానుంది..
[subscribe]
[youtube_video videoid=WahpR5yMmb8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: