‘మహర్షి’ ట్రైలర్ రిలీజ్

Maharshi Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Trailer,Maharshi Telugu Movie Trailer,Maharshi Movie Official Trailer,Maharshi Movie Theatrical Trailer,#MaharshiTrailer,Mahesh Babu New Movie Maharshi Trailer,Maharshi Movie Latest Updates
Maharshi Movie Trailer Out Now

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ‘మహర్షి’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నక్లెస్ రోడ్డు లోని పీపుల్ ప్లాజా లో నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ ను చూస్తుంటే మాత్రం సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. మహేష్ చెప్పిన డైలాగ్స్ ఒక్కొక్కటి బుల్లెట్స్ లా పేలుతున్నాయి. ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నా సార్..అసలు ఎలా తెలుస్తుంది మనం సక్సెస్ అయ్యామో? లేదో? మనం గతంలో ఎక్కడున్నాం.. ఇప్పుడెక్కడున్నాం.. దానిబట్టి మనకే అర్థమవుతుంది.. మనం సక్సెస్ అయ్యామో?లేదో?.. ఓడిపోతామని భయపడి ఆటలో దిగిపోతే ఎప్పటికీ గెలవలేం.. జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా.. అన్న డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. ఇంకా మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ల మధ్య సన్నివేశాలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అర్థమవుతుంది.

కాగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


[subscribe]
[youtube_video videoid=ByjXIbg4hjw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.