బండ్ల గణేష్ రాజకీయ వైరాగ్య జ్ఞానోదయం

Bandla Ganesh Learnt A Lesson With Politics,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bandla Ganesh About Politics,Bandla Ganesh Learned a Lesson With Politics,Bandla Ganesh Latest News,Reasons Behind Bandla Ganesh Quits Politics,Bandla Ganesh Quits Politics,Bandla Ganesh Far Away To Politics
Bandla Ganesh Learnt A Lesson With Politics

కొందరు వ్యక్తుల మాటతీరు, ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ కొంత విచిత్రంగా, విభిన్నంగా, విలక్షణంగా, వినోదంగా ఉంటే ఉండవచ్చేమోగానీ వారి మాటల్లోని మొండితనం ఒక్కోసారి ముచ్చటగా అనిపిస్తుంది. తప్పు తెలుసుకోవడానికి, తప్పును ఒప్పుకోవడానికి, తన  తప్పిదాన్ని బహిరంగంగా ప్రకటించడానికి గట్స్ కావాలి. అలా ఓపెన్ గా తన నిర్ణయ లోపాన్ని బహిరంగంగా ఒప్పుకొని , రాజకీయాలకు నేను పనికిరాను అని ప్రకటించిన బండ్ల గణేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ గా బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దశాబ్దాలుగా రాజకీయాలతో పెనవేసుకుపోయిన వారు కూడా స్వపక్షాన్ని అంత నెత్తిన పెట్టుకోలేదు… ప్రతిపక్షాన్ని అంత దారుణంగా విమర్శించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే  బ్లేడ్ తో పీక కోసుకుoటాను అని సంచలన ప్రకటనలు చేసిన బండ్ల గణేష్ తర్వాత ఆ స్టేట్మెంట్ ను ఒక కామిడీ స్కిట్  లాగా లైట్ గా తీసుకోండి అన్నాడు.మొత్తానికి ఎన్నికల  ఫలితాలను చూసి కాంగ్రెస్ వర్గీయులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయితే ఆ షాక్ నుండి మొదటగా కోలుకున్నది బండ్ల గణేష్ మాత్రమే.

” అవునండి… ఎలక్షన్స్ లో వంద అంటాం… అనుకుంటాం… వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు… అంటూ బండ్ల గణేష్ వేసిన రివర్స్ గేర్ ను మీడియా కూడా సరదాగానే తీసుకుంది. నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా ఎంత పెద్దవాడు అయినప్పటికీ బేసిక్ గా కమెడియన్ కావటంతో అందరూ కాసేపు నవ్వి ఊరుకున్నారు. కాగా నిన్న ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల పట్ల బండ్ల గణేష్ చేసిన కామెంట్లు, విసిరిన విసుర్లు కూడా బాగా నవ్వించాయి.”  మా నాన్న మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు… రేయ్ నువ్వు రాజకీయాలకు పనికి రావురా అని చిలక్కు చెప్పినట్టు చెప్పాడు. నేను విన్ల…రెచ్చిపోయా… ఏవేవో మాట్లాడా.. అమ్మో.. నిజంగా రాజకీయాలకు నేను పనికి రాను.. ఇక్కడ పొదుగులు కోసేస్తారు…


మా సినిమా ఇండస్ట్రీ ఇట్లా కాదు… టాలెంటు ఉంటే ఎవడైనా పైకి వస్తాడు… లేదంటే ఎంత పెద్ద స్టార్ కొడుకు అయినా ఇంటికి వెళ్లాల్సిందే… కానీ రాజకీయాల్లో అట్లా కాదు… రుద్దుతారు… వారసులను జనం మీద రుద్దుతారు… మా సినిమా ఇండస్ట్రీ గోమాత లాంటిది… టాలెంట్ ఉన్న  ఎవడైనా గోమాత సేవ చేసుకోవచ్చు… పాలు పిండుకోవచ్చు… కానీ ఈ రాజకీయం అలా కాదండి బాబోయ్… అందుకే రాజకీయాలకు శాశ్వతంగా గుడ్బై చెప్పేస్తున్నా… అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే  ఫలితాలు తారుమారు అయినంత మాత్రాన బండ్ల గణేష్  ఇలా ప్లేటు ఫిరాయించాడు అనుకోనవసరం లేదు. తన తప్పిదాన్ని, తొందరపాటును పబ్లిక్ గా మీడియాలో ఒప్పుకోనవసరంలేదు. అలా ఒప్పుకోవడంలో హానెస్టీ కనిపించింది… నిజమైన రియలైజేషన్ కనిపించింది. ఆ ఒప్పుకోలులో కొంత కామెడీ కూడా కనిపించింది.


మొత్తానికి బండ్ల గణేష్ రాజకీయ ప్రవేశమే కాదు.. నిష్క్రమణ కూడా వినోదాన్ని పంచింది. అతని రాజకీయ వైరాగ్య, జ్ఞానోదయాలు మరికొందరు సినిమా వారికి కూడా కళ్ళు తెరిపిస్తాయి అనుకోవచ్చు. పైకి సరదాగా కామెడీ లాగా అనిపించినప్పటికీ బండ్ల గణేష్ అనుభవంలో ఒక హెచ్చరిక ఉంది. సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు అని వాదించటం మూర్ఖత్వమే గాని… రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఏర్పరచుకోవాల్సిన అవగాహన, అంచనాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సినీ రాజకీయ తారలు తెలుసుకోవాలి అని బండ్ల గణేష్ అనుభవమే చెప్తుంది.

మొత్తానికి మళ్లీ సినిమాలు తీస్తా.. వేషాలు వేస్తా అంటూ బ్యాక్ టు పెవిలియన్ అయి  మదర్ ఇండస్ట్రీకి తిరిగి వస్తున్న బండ్ల గణేష్ కు ఆల్ ద బెస్ట్.( రాజకీయాల గురించి బండ్ల గణేష్ వ్యాఖ్యలు మనకు అనవసరం… సినిమా ఇండస్ట్రీని గోమాతతో పోల్చి నాలుగు మంచిమాటలు మాట్లాడినందుకే ఈ అభినందన వ్యాసం)-

[subscribe]


[youtube_video videoid=ZXTByHFxUqQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 17 =