ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజ్ తరుణ్.. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను అందుకుంటూ మిగిలిన యంగ్ హీరోలకు గట్టి పోటీనే ఇచ్చాడు. అయితే గత కొద్దికాలంగా మాత్రం సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు ఈ యంగ్ హీరో. దీంతో చాలా కాలం నుండి ఒక్క సినిమాను కూడా పట్టాలెక్కించలేదు. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజా అప్ డేట్ ఏంటంటే ఈ సినిమా ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అంతేకాదు.. ‘ఇద్దరి లోకం ఒకటే’ అన్న టైటిల్ ను కూాడ ఫిక్స్ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా స్క్రిప్ట్ ను రచయిత విజయేంద్రప్రసాద్ .. దర్శకుడు కృష్ణకి అందజేశారు.
కాగా జి.ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చుతున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=rThdRPOhjb8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























