ఖైదీ నంబర్ 150
తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి… ఆ సినిమాతో తన ఖాతాలో మరో ఘనవిజయాన్ని నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన… హిస్టారికల్ డ్రామా సైరా నరసింహారెడ్డి
తో బిజీగా ఉన్నారు. సైరా
చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో… కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాని చేయనున్నారు చిరు. జూన్ నుంచి ఈ మూవీ పట్టాలెక్కనుందని టాక్. ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిరు తదుపరి ప్రాజెక్ట్స్ ఉంటాయని ఆ మధ్య వార్తలు వినిపించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం… కొరటాల శివ సినిమా పూర్తయ్యేలోపే ఓ మెగా ప్రాజెక్ట్‌కి ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా మొదలయ్యాయని కథనాలు వస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుందని చాన్నాళ్ళుగా చిరు చెబుతూనే ఉన్నారు. మొత్తానికి… అది త్వరలోనే నెరవేరబోతుందన్నమాట. మరి… ఈ సారైనా చిరు, శంకర్ కాంబినేషన్ మూవీ వర్కవుట్ అవుతుందో లేదంటే వార్తలకే పరిమితమవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. అన్నట్టు… శంకర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం జెంటిల్‌మేన్
కి హిందీ రీమేక్ అయిన ది జెంటిల్ మేన్
లో చిరు హీరోగా నటించారు. మళ్ళీ పాతికేళ్ళ తరువాత శంకర్ కథతో చిరు సినిమా రాబోతోందనుకోవచ్చు.
[subscribe]
[youtube_video videoid=kk7nU6QHuWw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: