దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు… గ్లామర్ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. తెలుగు తెరపై గ్లామర్‌కి కొత్త గ్రామర్ నేర్పిన దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు. అంతేకాదు… బాక్సాఫీస్‌కీ కొత్త లెక్కలు నేర్పాడు. అగ్ర కథానాయకులతోనే కాదు నూతన తారలతో, మీడియం రేంజ్ హీరోల కాంబిననేషన్ లోనూ ఘనవిజయాలను అందించాడు ఈ శతాధిక చిత్రాల దర్శక దిగ్గజం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
`బాబు` (1975)తో మొదలైన కె.రాఘవేంద్రరావు దర్శకప్రస్థానం `గంగోత్రి` (2003)తో వంద చిత్రాల మైలురాయికి చేరుకుంది. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే… అల్లు అర్జున్ లాంటి టాలెంటెడ్ హీరోని తెలుగు తెరకు పరిచయం చేశాడు రాఘవేంద్రరావు. అలాగే అప్పట్లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఆర్తి అగర్వాల్‌కి చెల్లెలు అయిన అదితి అగర్వాల్‌ని కథానాయికగా పరిచయం చేశాడు.
కె.రాఘవేంద్రరావు ఆస్థాన సంగీత దర్శకులలో ఒకరైన స్వరవాణి కీరవాణి అందించిన బాణీలు ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇందులోని ప్రతీ పాట అప్పట్లో సంగీత ప్రియులను అలరించింది. అల్లు అరవింద్, సి.అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ అయ్యింది.
2003 మార్చి 28న విడుదలైన `గంగోత్రి`… నేటితో 16 వసంతాలను పూర్తిచేసుకుంటోంది. అంటే… `పదహారేళ్ళ వయసు` దర్శకుడు సెంచురీ కొట్టి పదహారేళ్ళు పూర్తవుతోందన్నమాట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: