సిద్ధార్థ్ హీరోగా నటించిన `ఓ మై ఫ్రెండ్` (2011) చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్… నాని కథానాయకుడిగా నటించిన `ఎంసీఏ`తో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు తన మూడో చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. అంతేకాదు… ఈ సారి ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడట. ఆ స్టార్ మరెవరో కాదు… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే బన్నీకి వేణు ఓ స్క్రిప్ట్ వినిపించాడని… అది నచ్చడంతో బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. కాగా… ఈ సినిమాని వేణు శ్రీరామ్ తొలి, మలి చిత్రాలను నిర్మించిన `దిల్` రాజు నిర్మించనున్నాడని తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ (త్రివిక్రమ్ దర్శకత్వం) ఏప్రిల్‌లో ప్రారంభం కానుండగా… సుకుమార్ కాంబినేషన్ మూవీ స్క్రిప్ట్ దశలో ఉంది. అలాగే విక్రమ్ కుమార్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లోనూ బన్నీ సినిమాలు చేయబోతున్నాడు. మొత్తానికి… ఐదు చిత్రాల లైనప్ తో బన్నీ `టాక్ ఆఫ్ టాలీవుడ్` అవుతున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: