అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్.. అందులో రాజమౌళి డైరెక్టర్ అంటే అంచనాలు మామూలుగా ఉండవు కదా. అందుకే వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసిన రోజు నుండే అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాపై కొంత కాలంగా వచ్చిన డౌట్లకు మొన్నీమధ్యనే చిత్రయూనిట్ ఓ ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ, హీరోయిన్లు, రిలీజ్ డేట్ ఇలా పలు విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. గత ఏడాదే హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే… రెండో షెడ్యూల్ నార్త్ ఇండియాలో జరుగనుంది. ఢిల్లీలో జరగనున్న ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, చరణ్ తోపాటు హీరోయిన్లు అలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ లు కూడా జాయిన్ కానున్నారట. కొద్ది రోజులు అక్కడే షెడ్యూల్ జరుపుకోనుందట టీమ్.
కాగా స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సముద్రఖని నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న విడుదలకానుంది.
[youtube_video videoid=WahpR5yMmb8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: