1993 సంవత్సరం లో నటుడు, నిర్మాత మోహన్ బాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి లో శ్రీ విద్యా నికేతన్ ట్రస్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీ విద్యా నికేతన్ ట్రస్ట్ లోని పలు కాలేజీలు విద్య ను అందిస్తున్నాయి. ఫీజ్ రీఎంబర్స్ మెంట్ విషయం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నందుకు నిరసనగా ఈ రోజు ర్యాలీ కి మోహన్ బాబు పిలుపు నిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తిరుపతి లో వేలాదిమంది విద్యార్థులతో ర్యాలీ కి మోహన్ బాబు ప్లాన్ చేశారు. ఈ ర్యాలీ ని ఆపేందుకు పోలీస్ యంత్రాగం విద్యానికేతన్ ఎదుట ఈ రోజు 7గంటలకు భారీగా మోహరించారు. మోహన్ బాబు ను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. నిరసన ర్యాలీ ని ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నిస్తుందని, ఎట్టి పరిస్థితులలోనూ నిరసన ర్యాలీ కొనసాగిస్తానని
మోహన్ బాబు చెప్పారు.
ఫీజ్ రీఎంబర్స్ మెంట్ విషయ మై ఈ రోజు తిరుపతి లో శాంతియుత నిరసన ర్యాలీ కి ప్లాన్ చేశానని, పోలీసులు తిరుపతి లోని తన ఇంటికి వచ్చారని, నిరసన ర్యాలీ ని అడ్డుకోనేలా ఉన్నారని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
[youtube_video videoid=3lyE7NwKvKc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: