`118`తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం… ఈ టాలెంటెడ్ హీరో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు మల్లిడి వేణు దర్శకత్వం వహించనున్నాడు. కాగా… ఈ సినిమాకి `తుగ్లక్` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని మే నుంచి పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… యన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని సమాచారం. కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. `118` తరువాత వస్తున్న ఈ సినిమాతోనూ కళ్యాణ్ రామ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
[youtube_video videoid=wPqWpn9VDJ8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: