హీరో, విలన్, క్యారెక్టర్ ఇలా ఏ పాత్ర అయినా ఇచ్చినా సరే చేయగలిగిన నటుల్లో ఆది పినిశెట్టి కూాడా ఉంటాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన చేసిన సినిమాలను చూస్తే ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సరైనోడు సినిమాలో విలన్ గా.. రంగస్థలం సినిమాలో కుమార్ బాబు క్యారెక్టర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.. అలా ఆది లో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో అటు విలన్ పాత్రలను .. కీలకమైన పాత్రలను చేస్తూనే, మరోవైపున హీరోగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుండూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ఆది పినిశెట్టి హీరోగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మనోజ్ దామోదర్ దర్శకత్వంలో ఆర్ ఎఫ్ సి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘పార్ట్ నర్’ అనే టైటిల్ ను కుడా ఖరారు చేశారు చిత్రయూనిట్. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెగ్యులర్ షూటింగును కూడా త్వరలోనే మొదలుపెట్టేయనున్నారు. కాగా ఈసినిమాలో ఆది సరసన హన్సిక కథానాయికగా నటిస్తుంది. మరి ఈసినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=A0C8L2VYLfU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: