నేను చాలా హ్యాపీగా ఉన్నా అంటున్నాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ. ఇంతకీ బ్రహ్మాజీ అంత హ్యాపీగా ఉండటానికి కారణం ఏంటనుకుంటున్నారా? అసలు కారణం ఏంటంటే.. సైరా సినిమాలో నటించడమే. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మాజీ సైరా సినిమా గురించి మాట్లాడుతూ చిరంజీవితో నటించడంతో తన డ్రీమ్ నిజమైందని చెబుతున్నాడు. అంతేకాదు రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రంగస్థలం సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో చేయాలని నా కోరికని నేను చరణ్ తో ఒకసారి అన్నాను.. అది గుర్తుంచుకొని తను ఒకరోజు రంగస్థలం షూటింగ్ పూర్తయిన తరువాత నన్ను సురేందర్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లి.. ఏదైనా రోల్ ఉంటే చూడమని అడిగాడు… చరణ్ చేసిన పనికి నేను షాకయ్యా.. నిజానికి చరణ్ ఫోన్ చేసి అయినా ఈ విషయాన్ని చెప్పొచ్చు.. కానీ తానే స్వయంగా తీసుకెళ్లాడు.. అలా సైరా సినిమాలో నాకు కూడా ఒక పాత్ర దక్కిందని చెప్పాడు. అంతేకాదు..ఈ సినిమాకు 80 రోజులు కేటాయించాను.. నిజానికి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ని రోజులు ఒక సినిమాకు కేటాయిస్తే రెమ్యునరేషన్ తగ్గిస్తారు.. కానీ చరణ్ మాత్రం నా రెమ్యూనరేషన్ పెంచాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. చిరంజీవి గారితో పనిచేయడం.. ఆయనతో సమయం గడపడం మర్చిపోలేని జ్ఞాపకాలని ఆనందాన్ని వ్యక్తం చేశాడు బ్రహ్మాజీ.
కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయన తార, తమన్నా, సుధీప్, విజయ సేతుపతి లాంటి తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=eVR5aHxO5AQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: