ఆర్ఎక్స్ 100 సినిమాతో సన్సేషనల్ హీరోగా మారిన కార్తికేయ ఈసారి ‘హిప్పీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టి ఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెలుగు, తమిళ భాషలలో హిప్పీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, స్టిల్స్ యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను పెంచాయి. ఇక గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. నేచురల్ స్టార్ నాని తన ట్విట్టర్ ద్వారా టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో హీరో కార్తీకేయ సరసన దిగంగన హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ఆర్.డి రాజశేఖర్. మరి ఒక్క చిత్రంతోనే ఊహించని స్టార్ డం ని అందుకున్న కార్తికేయ.. హిప్పీ తో తమిళనాట కూడా ప్రూవ్ చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాడు. మరి ఈ సినిమా కార్తికేయకు హిట్ నిస్తుందా ? లేదా చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: