మెగా కాంపౌండ్ నుంచి తెలుగు తెరకు పరిచయమైన తొలి కథానాయిక కొణిదెల నిహారిక. `ముద్దపప్పు ఆవకాయ`, `నాన్న కూచి` వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ… `ఒక మనసు`, `హ్యాపీ వెడ్డింగ్` వంటి సినిమాల్లోనూ నటించి తెలుగువారికి మరింత చేరువైంది ఈ మెగా డాటర్. కాగా… ఈ టాలెంటెడ్ గర్ల్ నటించిన తాజా చిత్రం `సూర్యకాంతం` విడుదలకు సిద్ధమైంది. వేసవి కానుకగా మార్చి 29న తెరపైకి రానున్న ఈ సినిమాకి `ముద్దపప్పు ఆవకాయ` ఫేమ్ ప్రణీత్ దర్శకత్వం వహించాడు. నిహారిక సోదరుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పకుడిగా వ్యవహరించాడు. టీజర్, సింగిల్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమాపై సర్వత్రా మంచి ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో నిహారికకి తల్లి పాత్రలో ప్రముఖ నటి సుహాసిని నటించారు. అంతేకాదు… ఈ రెండు పాత్రల మధ్య సాగే సన్నివేశాలు వినోదభరితంగా ఉంటాయని టాక్. ఆసక్తికరమైన విషయేమిటంటే… గత ఏడాది ప్రథమార్థంలో వరుణ్ తేజ్‌కి తల్లిగా సుహాసిని నటించిన `తొలిప్రేమ` విడుదలై విజయం సాధించింది. మళ్ళీ ఇప్పుడు వరుణ్ చెల్లెలు నిహారికకి అమ్మగా సుహాసిని నటించిన `సూర్యకాంతం` ఈ ఏడాది ప్రథమార్థంలో రిలీజవుతుంది. మరి… `తొలిప్రేమ` సెంటిమెంట్ `సూర్యకాంతం`కి కూడా రిపీట్ అవుతుందేమో చూడాలి.
[youtube_video videoid=t-SWlHFaFUk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: