హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో సుధాకర్ కోమాకుల హీరోగా తెరకెక్కుతున్న సినిమా `నువ్వు తోపురా`. బేబి జాహ్నవి సమర్పణలో యునైటడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) పై డి.శ్రీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఏప్రిల్ 26న ఈ సినిమా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ – “మా చిత్రం గీతా ఫిలింస్, జి 3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదల అవుతుండటం మాకు ఆనందంగా ఉంది. అరవింద్‌గారికి, బన్ని వాసుగారికి కృతజ్ఞతలు“ అన్నారు.
సహ నిర్మాత డా.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్.ఎ) మాట్లాడుతూ.. మంచి నిర్మాణ విలువలతో అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశమైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో, తదితర ప్రాంతాల్లో షూటింగ్ జురుపుకున్న చిత్రమిది“ అన్నారు.
దర్శకుడు బి.హరినాథ్ మాట్లాడుతూ – ఈసినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.
సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టి, నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యా రెడ్డి, జెమిని సురేష్, దువ్వాసి మోహన్, ఫిష్ వెంకట్, కల్పలత, పద్మజ, జబర్ దస్త్ రాకేష్, మహేష్ విట్టా, సిండీ పెరెజ్, జ్యారెడ్ బ్రాసన్, డౌసీ పియెద్రా, అననోఖ్, శ్రీని కొల్ల, దీపక్ రావెళ్ల, రాజ్ ఆనందేసి, క్లేర్ బ్రౌన్, ఎడ్మండ్ రోజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: హరినాథ్ బాబు, నిర్మాత: డి.శ్రీకాంత్, కో ప్రొడ్యూసర్: డా.జేమ్స్ వాట్ కొమ్ము, అసోసియేట్ ప్రొడ్యూసర్: రితేష్ కుమార్, స్టంట్స్: విజయ్ మాస్టర్, డుయ్ బెక్, కెమెరా: ప్రశాష్ వేళాయుధన్, వెంకట్ సి.దిలీప్, ఆర్ట్: జెక్ జంజర్, ఎడిటర్ః ఎస్.బి ఉద్ధవ్, సంగీతం: సురేష్ బొబ్బలి, ఆమెరికా లైన్ ప్రొడ్యూసర్: స్టెపెనీ ఒల్లర్టన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి.
[youtube_video videoid=gLDf8g9CgsY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: