అటు బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గుడుపుతోంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఈ నేపథ్యంలోనే అమోల్ సేన్ గుప్తా దర్శకత్వంలో బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో కూడా శ్రద్ద నటిస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సైనా పాత్రలో నటించేందుకు గాను సైనా కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద నెల రోజుల పాటు బ్యాడ్మింటన్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంది శ్రద్ధాకపూర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ..ఈ సినిమా నుండి శ్రద్దా కపూర్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు శ్రద్దా స్థానంలో పరిణితి చోప్రాను తీసుకున్నారట చిత్ర యూనిట్. ఈ విషయాన్ని టీ సిరీస్ సంస్థ అధినేత భూషణ్‌కుమార్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు. ‘‘సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించబోతున్న పరిణీతి చోప్రాకు స్వాగతం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. అయితే షూటింగ్ సమయంలో శ్రద్ధాకపూర్‌కి డెంగ్యూ ఫీవర్ రావడంతో ఆమెను తప్పించారని తెలుస్తోంది. ఇది ఒక వాదన అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. శ్రద్దా కు ఫీవర్ ఎప్పుడో తగ్గిపోయిందని.. ప్రస్తుతం కొన్ని సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొంటుంది.. కావాలనే శ్రద్దాను తప్పించి ఉంటారని బాలీవుడ్ లో చర్చలు కొనసాగుతున్నాయి. మరి ఈవిషయంలో క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగష్ట్ 15 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=3OftuTIrF_4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: