ఈ తరం కథానాయికల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న కథానాయిక… సమంత. తొలి చిత్రం `ఏమాయ చేసావె` నుంచి గత చిత్రం `యూ టర్న్` వరకు తన ఖాతాలో పలు విజయాలను నమోదు చేసుకుందీ అందాల తార. కాగా… ఈ టాలెంటెడ్ బ్యూటీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `మజిలీ` ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్ళయ్యాక తన భర్త, కలిసొచ్చిన కథానాయకుడు నాగచైతన్యతో సామ్ నటించిన సినిమా కావడంతో… `మజిలీ`పై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్, సింగిల్స్‌తో ఇప్పటికే ఇంప్రెస్ చేసిన ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి `నిన్ను కోరి` ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… సామ్‌కి సమ్మర్ సీజన్‌తోనే మంచి అనుబంధమే ఉంది. `మనం` (2014)తో మొదలైన సమంత వేసవి ప్రయాణం… `సన్నాఫ్ సత్యమూర్తి` (2015), `24`, `అఆ` (2016), `రంగస్థలం, మహానటి, అభిమన్యుడు` (2018) వరకు విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో… సామ్‌కి కలిసొచ్చిన సీజన్‌లో వస్తున్న `మజిలీ` కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: