`హ్యాపీడేస్`(2007)తో తెలుగు తెరకు పరిచయమైన యువ నటుడు నిఖిల్. ఆ తరువాత `యువత`(2008)తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే… `యువత` అనంతరం దాదాపు ఐదేళ్ళు విజయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది నిఖిల్‌కి. `స్వామి రారా` (2013) రూపంలో దక్కిన ఆ సక్సెస్‌తో మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చిన ఈ యంగ్ హీరో… ఆ తరువాత `కార్తికేయ`(2014)తో మరో హిట్‌ని సొంతం చేసుకున్నాడు. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` (2016) లాంటి సినిమాలతోనూ మురిపించాడు. మళ్ళీ విజయాలతో దోబూచులాట తప్పలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో… ఈ నెలలోనే కొత్త చిత్రం `అర్జున్ సురవరం`తో సందడి చేయనున్నాడు నిఖిల్. తమిళ చిత్రం `కణితన్`కి రీమేక్‌గా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 29న తెరపైకి రానుంది. ఇక ఈ సినిమా విడుదలైన వెంటనే `శ్వాస`అనే మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నాడు నిఖిల్. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ… ఈ సంవత్సరంలోనే రిలీజ్ కానుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఒకే ఏడాదిలో నిఖిల్ రెండు చిత్రాలతో పలకరించి… దాదాపు నాలుగేళ్ళు అయ్యింది. 2015లో `సూర్య వెర్సస్ సూర్య`, `శంకరాభరణం` … ఇలా రెండు చిత్రాలతో పలకరించిన నిఖిల్… ఆ తరువాత మాత్రం ఏడాదికో సినిమాతో సందడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో… ఈ సంవత్సరం నిఖిల్ నుంచి రెండు చిత్రాలు రావడం విశేషమనే చెప్పాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: