యువ కథానాయకుడు రాజ్ తరుణ్ కెరీర్‌లో బెస్ట్ హిట్‌గా నిలచిన చిత్రం `కుమారి 21 ఎఫ్`. కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా… మ్యూజికల్‌గానూ మెప్పించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు… సదరు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి మేజర్ ప్లస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో… ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందని ఫిల్మ్‌నగర్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `లవర్` చిత్రం తరువాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కృష్ణా రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించనున్నట్లు తెలిసింది. త్వరలోనే దేవిశ్రీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరి… `కుమారి 21 ఎఫ్` తరువాత మరోసారి రాజ్ తరుణ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=DDQfiI_oi1Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: