ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్ దీక్షితులు (దీవి శ్రీనివాస దీక్షితులు) కన్నుమూశారు. ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా.. మార్గమద్యంలోనే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన మురారి చిత్రంలో పూజారిగా నటించిన ఈయనకు ఆ సినిమాలో మంచి పేరొచ్చింది. ఇంద్ర, ఠాగూర్, అతడు, వర్షం తదితర విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, రేపల్లెలో 1956, జులై 28 న దీక్షితులు జన్మించారు.
[youtube_video videoid=CvHNFZnLAbs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: