యాక్షన్ హీరో గోపీచంద్ షూటింగ్ లో గాయాలపాలయ్యారు. AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతుంది. రాజస్థాన్ రాష్ట్రం లోని జైపూర్ లో మూవీ లోని బైక్ ఛేజింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్ జరుగుతున్న సమయం లో బైక్ స్కిడ్ అయి గోపీచంద్ కు గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి దగ్గరలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కు గోపీచంద్ ను చిత్ర యూనిట్ తరలించారు. పెద్దగా ప్రమాదం ఏమీ లేదని ట్రీట్ మెంట్ అనంతరం షూటింగ్ లో పాల్గొనవచ్చని డాక్టర్స్ తెలిపారు. విశాల్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మే నెలలో విడుదల కానుంది.
[youtube_video videoid=9jOVc1hBOEE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: