రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్ పై పలు కీలక సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇక తారక్ కూడా హాలీడే ట్రిప్ నుండి వచ్చేశాడు కాబట్టి కాబట్టి తాను కూడా త్వరలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి మొదటి సారి రాజమౌళి స్పందించారు. బోస్టన్ లో గోదావరి రెస్టారెంట్ టీమ్ రాజమౌళిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే కదా. అక్కడ హార్వర్డ్ యూనివర్శిటీలో కాన్ఫరెన్స్ కు వెళ్లిన రాజమౌళి అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో.. ఏ ఒక్క ఇండస్ట్రీకో సంబంధించిన సినిమా కాదు… దేశ వ్యాప్తమైన సినిమా ఇది… అంతేకాదు.. బాహుబలిలాగే ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో.. భారీ క్యాస్టింగ్ ఉంటుందని చెప్పారు. మొత్తానికి ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ గురించి నోరు విప్పని జక్కన్న మొదటి సారి ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
కాగా దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్లు.. మిగిలిన క్యాస్టింగ్ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంలో రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూద్దాం..
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: