ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు ఒక రోజు గ్యాప్‌లోనో లేదంటే వారం గ్యాప్‌లోనో రిలీజవడం టాలీవుడ్‌లో అప్పుడప్పుడు చోటు చేసుకునే వ్యవహారమే. ఈ సంక్రాంతికి ఒక రోజు తేడాతో మెగా కాంపౌండ్ హీరోల చిత్రాలు `వినయ విధేయ రామ`, `ఎఫ్ 2` విడుదలయ్యాయి. `వినయ విదేయ రామ`లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించగా… `ఎఫ్ 2`లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కట్ చేస్తే… ఇప్పుడే శైలిలో నందమూరి ఫ్యామిలీకి చెందిన ఇద్దరు కథానాయకుల సినిమాలు వారం గ్యాప్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాలే… `యన్.టి.ఆర్. మహానాయకుడు`, `118`. నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన `యన్.టి.ఆర్. మహానాయకుడు` ఫిబ్రవరి 22న తెరపైకి రానుండగా… వారం రోజుల గ్యాప్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన `118` రానుంది. మరి… వారం రోజుల గ్యాప్‌లో వస్తున్నబాబాయ్, అబ్బాయ్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే… `మహానాయకుడు`లో కూడా కళ్యాణ్ రామ్ ఓ కీలక పాత్ర పోషించడం. అంటే… వారం రోజుల గ్యాప్‌లో కళ్యాణ్ రామ్ డబుల్ ధమాకా ఇవ్వనున్నాడన్నమాట.
[youtube_video videoid=jUxnrFUYzBA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: