నూతన దర్శకుడు రజత్ రవిశంకర్ దర్శకత్వంలో `ఖాకి` సినిమా తరువాత కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కలిసి నటిస్తున్న సినిమా దేవ్. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య యాక్షన్ ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు – కార్తి, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ
దర్శకుడు – రజత్ రవిశంకర్
నిర్మాత – లక్ష్మణ్ కుమార్
సంగీతం – హరీష్ జైరాజ్
కథ:
దేవ్ రామలింగ్ (కార్తి) కి అడ్వెంచర్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక అడ్వెంచర్ చేస్తూనే ఉంటాడు. ఎప్పటికైనా సరే ఎవరెస్ట్ ను ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఇక తమ స్నేహితులైన విఘ్నేష్, నిషాలను కూడా తాను చేసే ప్రతి అడ్వెంచర్ లో.. తాను వెళ్లే ప్రతి చోటకి తీసుకెళుతుంటాడు. దేవ్ చేసే సాహసాలకు బ్రేక్ వేయాలంటే తనని ప్రేమలో పడేయాలని భావించిన విఘ్నేష్, నిషా ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ చూసి ఓ అమ్మాయి సెలెక్ట్ చేసి ప్రేమించమని దేవ్‌కు సలహా ఇస్తారు. అలా ఫ్రొఫైల్ పిక్ చూసిన వెంటనే మేఘన ( రకుల్) ను చూసి ఇష్టపడతాడు. దాంతో మేఘనను ఇంప్రెస్ చేయడానికి దేవ్ ట్రై చేస్తుంటాడు. మేఘన అతి చిన్న వయసులో ఓ కంపెనీ సీఈఓ గా ఉంటూ.. బాధ్యతగా ఉంటుంది. దానికి తోడు తన తల్లి జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా మగాళ్ల మీద ద్వేషం పెంచుకొని సంపాదించటమే జీవిత లక్ష్యంగా నిర్ణయించుకుంటుంది. అలాంటి మేఘనను.. దేవ్ ఆఖరికి ప్రేమలో పడేస్తాడు. మేఘన మొదట నో చెప్పిన ఆతరువాత దేవ్ ను లవ్ చేయడం మొదలు పెడుతుంది. ఇద్దరు డీప్ లవ్ లో ఉండగా కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తుంది. ఆ తరువాత మేఘన యూఎస్ వెళ్ళిపోతుంది. వారు వీడిపోవడానికి కారణం ఏంటీ.. ఇద్దరూ ఫైనల్ గా ఎలా కలుస్తారు..? దేవ్ లక్ష్యం నెరవేరిందా? విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
అడ్వంచర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కేవలం అడ్వంచర్స్ మాత్రమే కాకుండా ప్రేమ, స్నేహం, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కార్తినే. హీరో కార్తీ అటు స్నేహితుడిగా, ఇటు ప్రేమికుడిగా అద్భుతంగా నటించాడు. తనకు అలవాటైన పాత్రలో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది.
ఇక ఖాకి సినిమాలోనే కార్తి, రకుల్ జోడీ బాగా సెట్ అయినట్టు కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి జోడి స్క్రీన్ పై బాగా కనిపిస్తుంది. మేఘన పాత్రకు రకుల్ కరెక్ట్ గా సెట్ అయ్యింది. యాక్టర్స్ ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ లు వారి పాత్రలకు తగ్గట్లుగా నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఈ చిత్రంలో నటన పరంగా మంచి ప్రాధాన్యత దక్కింది.
దేవ్ చిత్రంలో విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎవరెస్టు ఎపిసోడ్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్. ప్రతీ ఫ్రేమ్‌ను తెర మీద అందంగా, రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కార్తి
సినిమాటోగ్రఫి
లొకేషన్స్
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్‌ప్లే
సంగీతం
[wp-review id=”15550″]
[youtube_video videoid=Jx2dgbldcLE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: