అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయేషా సైగల్, వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరో ఆర్య వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు మనందరికీ తెలిసిందే. మార్చి 9, 10 తేదీలలో వీరి వివాహం జరగనుందని.. హైదరాబాద్‌లో ఆర్య, సాయేషాల పెళ్లి వేడుక జరపనుండగా, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ విషంయలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఆర్య, సాయేషా సైగల్. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా.. ‘మా తల్లితండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మా జీవితాలలో అతి ముఖ్యమైన రోజు గురించి షేర్ చేయాలనుకుంటున్నాం.. ”మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం.. మీ బ్లెస్సింగ్స్ కావాలి” అంటూ ఆర్యతో ఉన్న ఫోటోని షేర్ చేసి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది సాయేషా. దీంతో వీరి పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ జంటకి సినీ సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా 2018లో వచ్చిన గజినీకాంత్ అనే చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ చిత్రం ద్వారా ఏర్పడిన పరిచయంతో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇక ఇరు కుటుంబాల సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఫ్రెండ్స్‌గా ఉన్న వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ప్రస్తుతం సూర్య-కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కప్పం చిత్రంలో వీరిద్దరూ నటిస్తున్నారు.
Happy Valentines Day! ❤️ pic.twitter.com/5sQfQJARGf
— Sayyeshaa (@sayyeshaa) February 14, 2019
[youtube_video videoid=7B9bBrKEWvA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: