ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కథానాయకుల్లో జగపతిబాబు ఒకరు. అలాంటి జగపతిబాబు కెరీర్ లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలచిన సినిమా `శుభలగ్నం`. 1994లో వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రాన్ని కుటుంబకథా చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించగా… జగపతిబాబుకి జోడీగా ఆమని, రోజా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డబ్బంటే పిచ్చి ప్రేమ ఉన్న ఓ భార్యామణి… ఆ డబ్బు కోసం తనను ప్రాణం కన్న మిన్నగా ప్రేమించే భర్తను కూడా అమ్ముకుని… పైకం మైకంలో పడి ఏం కోల్పోయిందో తెలుసుకున్నాక తన తప్పుని ఎలా సరిదిద్దుకుంది? అనే పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమా… అప్పట్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. మ్యూజికల్‌గానూ సెన్సేషన్ సృష్టించింది.
కట్ చేస్తే… ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా మరో చిత్రం రాబోతోందని సమాచారం. ఇందులోనూ కథానాయకుడిగా జగపతిబాబు నటించే అవకాశముందని టాలీవుడ్ టాక్. దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరి… విలన్, క్యారెక్టర్ రోల్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న జగ్గూభాయ్.. తనకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన పాతికేళ్ళ నాటి క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సీక్వెల్ తో మరోసారి మెప్పిస్తాడేమో చూడాలి.
[youtube_video videoid=d2asgcwJcC4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: