`రాక్ష‌స‌న్‌` రీమేక్‌లో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌

Bellamkonda Sreenivas To Act In A Remake Film,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Bellamkonda Sreenivas to Play in a Remake Film,Bellamkonda Sreenivas Next Movies News,Bellamkonda Sreenivas Upcoming Film Updates,Actor Bellamkonda Sreenivas New Movie News
Bellamkonda Sreenivas To Act In A Remake Film

గ‌త ఏడాది త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం `రాక్ష‌స‌న్‌`. సైకలాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్‌, అమ‌లా పాల్ జంట‌గా న‌టించారు. ఇప్పుడీ సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. కాగా… కోనేరు స‌త్య‌నారాయ‌ణ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నార‌ని టాలీవుడ్ టాక్‌. తెలుగు వెర్ష‌న్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ హీరోగా న‌టించ‌నుండ‌గా… ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిబ్ర‌వ‌రి 21 నుంచి షూటింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించుకోనున్న ఈ సినిమా… వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుందని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

సాయిశ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం తేజ రూపొందిస్తున్న `సీత‌` సినిమాతో బిజీగా ఉన్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ… మార్చి నెలాఖ‌రులో తెరపైకి రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + sixteen =