పరమేశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన టెంపర్ మూవీ ఫిబ్రవరి 13, 2015 సంవత్సరం లో రిలీజయి కమర్షియల్ గా సూపర్ సక్సెసయింది. సిక్స్ ప్యాక్ తో, స్టైలిష్ గా తన లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ప్రెజెంట్ చేసి ఎన్టీఆర్ నందమూరి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమర్షియల్ ఎంటర్ టైనర్ టెంపర్ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన మూడవ సినిమా టెంపర్. బృందావనం, బాద్ షా మూవీస్ తోపాటు టెంపర్ మూవీ కూడా ఘనవిజయం సాధించింది. సక్సెస్ ఫుల్ టెంపర్ మూవీ హిందీభాషలో రణవీర్ సింగ్ హీరోగా సింబా పేరుతో రీమేకయి బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. తమిళ భాషలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ జరుపుకుంటుంది. ఈ రోజు తో టెంపర్ మూవీ 4సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.
టెంపర్` – కొన్ని విశేషాలు:
* `బృందావనం`, `బాద్‌షా` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత యన్టీఆర్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రమిది. ఈ సినిమాతో ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టింది.
* `టెంపర్` చిత్రాన్ని హిందీలో `సింబా` పేరుతో రీమేక్ చేశారు. డిసెంబర్ 28న విడుదలైన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా… ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. కాగా… ఈ సినిమా తమిళ వెర్షన్ `అయోగ్య` త్వరలోనే విడుదల కానుంది. ఇందులో విశాల్ హీరోగా నటించాడు.
* సహజంగా పూరీ జగన్నాథ్ తన సినిమాలకి తానే కథలు రాస్తుంటారు. అయితే… ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించడం విశేషం.
[youtube_video videoid=s_59OkKeVXM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: