ఫైనల్లీ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. గత కొద్దికాలంగా ఈ సినిమా రిలీజ్ విషయంలో పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ ను తెరకెక్కించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఆ బయోపిక్ లో.. మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేశారు. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఎన్టీఆర్ కథానాయకుడు ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది. దీంతో ఆ ఎఫెక్ట్ ఎన్టీఆర్ మహానాయకుడుపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్రిష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందుకే ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేయాల్సిన మహానాయకుడు వాయిదా పడింది. ఆ తరువాత శివరాత్రికి రిలీజ్ చేస్తారని.. ఇంకా పలు డేట్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆ కన్ఫ్యూజన్స్ కు తెరదించి సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన సినిమా రిలీజ్
చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈసినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర పోషించిన విద్యాబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తెలిపింది. ఈ సినిమా ఫిబ్రవరి 22 వ తారీఖు న విడుదల కానుందని ఆ పనుల్లో దర్శకుడు క్రిష్ బిజీగా ఉన్నాడు అంటూ క్రిష్ ఫోటో పోస్ట్ చేసింది విద్యాబాలన్.
మరి నందమూరి తారకరామారావు గారి రాజకీయ జీవితాన్ని జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాపైనే ఇప్పుడు అందరి కన్ను పడింది. మరి ఈ పార్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=rRSh7ljoFxA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: