సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి పలువురి లుక్స్ ను విడుదల చేసిన సంగతి విదితమే. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు లుక్ ను కూడా విడుదల చేశారు. ఈరోజు జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ చూస్తుంటే ‘సైరా’లో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. గుబురు గడ్డం, పొడవైన జుట్టు, తలపాగా, నుదుటన కుంకుమతో జగపతిబాబు లుక్ ‘అదుర్స్’ అనేలా ఉంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్న జగపతిబాబు… ఈ సినిమాతో ఎలా మెప్పిస్తారో చూద్దాం.
కాగా ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయన తార, తమన్నా, సుధీప్, విజయ సేతుపతి లాంటి తదితర ప్రముఖ నటీనటులు ఎందరో ఇందులో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=ghs_HFclpP4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: