గత ఏడాది పుట్టిన రోజు కానుకగా విడుదలైన `రంగస్థలం`తో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాదు… నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి మెగాభిమానులనే కాదు సగటు ప్రేక్షకులకు అలరించాడు. అయితే… `రంగస్థలం` తరువాత వచ్చిన `వినయ విధేయ రామ` నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో… దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` (వర్కింగ్ టైటిల్)పై అందరి దృష్టి ఉంది. ఇందులో… యంగ్ టైగర్ యన్టీఆర్‌తో కలసి తొలిసారిగా కలసి నటిస్తున్నాడు చరణ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగునాట చాన్నాళ్ళ తరువాత వస్తున్న సిసలైన మల్టీస్టారర్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా… ఇందులో రెండు విభిన్న పాత్రల్లో చరణ్ కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్. ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్ రామరాజుగా కనిపిస్తాడని సమాచారం. ఈ పాత్ర తాలూకు ఫస్ట్ లుక్‌ని చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఇక తారక్ ఫస్ట్ లుక్‌ని అతని పుట్టినరోజునగానీ లేదంటే కాస్త ముందే గానీ విడుదల చేసే అవకాశముందట. 2020 వేసవికి `ఆర్ ఆర్ ఆర్` తెరపైకి రానుంది.
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: