విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించారు. అయితే అనుకున్న అవుట్ పుట్ ఇవ్వని నేపథ్యంలో సినిమాను మళ్లీ రీషూట్ చేస్తున్నామని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ధృవ్ మినహా మిగిలిన క్యాస్టింగ్ మొత్తం కొత్తవాళ్లను తీసుకుంటున్నామని కూడా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఇష్యూపై బాలా కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు. వర్మ సినిమా నుంచి స్వచ్ఛందంగానే తప్పుకున్నానని.. చిత్ర నిర్మాతలతో సృజనాత్మకమైన విభేదాల కారణంగానే తాను ఈ సినిమా నుంచి తప్పకుంటున్నానని, ధృవ్ కెరీర్ దృష్ట్యా ఇంతకంటే ఈ విషయంపై ఏమీ మాట్లాడలేనని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాపై అప్పుడే పలు వార్తలు చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. ఈసినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. ఈ చిత్రంలో షాలిని పాండే పోషించిన పాత్రలో జాన్వీ కపూర్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ రీమేక్ లో ముందు హీరోయిన్ పాత్రలో నటించిన మేఘా చౌదరి జియా శర్మ పాత్రలో నటించనున్నట్లు తమిళ చిత్ర వర్గాల సమాచారం. అంతేకాదు గౌతమ్ మీనన్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించే అవకాశం వుందని, ఇప్పటికే హీరో విక్రమ్ ఆయనను సంప్రదించారని, గౌతమ్ మీనన్ కూడా ఈ సినిమా విషయంలో సుముఖంగా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు అధికారికంగా ప్రకటన ఇచ్చేంతవరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=EVrgWqwbdIE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: