కొత్త సంవత్సరంలో సినిమాల సందడి ప్రారంభమయ్యేది సంక్రాంతి సీజన్తోనే. జనవరి 10 నుండి 15 లోపు పెద్ద సినిమాల పోటాపోటీ రిలీజ్ ల కోలాహలం పూర్తయ్యాక అప్పటిదాకా వెయిటింగ్ లిస్టులో ఉన్న చిన్న సినిమాలు వరుసగా క్యూ కడతాయి. జనవరి సెకండ్ హాఫ్ నుండి మార్చి సెకండ్ హాఫ్ వరకు పెద్ద సినిమాల హడావిడి ఏమాత్రం కనిపించదు. మార్చి సెకండ్ హాఫ్ నుంచి జూన్ సెకండ్ హాఫ్ వరకు సాగే మూడు నెలల కాలాన్ని సమ్మర్ సీజన్ గా పరిగణిస్తుంది ఫిలిం ట్రేడ్. సంక్రాంతి తరువాత పెద్ద సినిమాల రిలీజ్ లకు ఫేవరేట్ సీజన్ ఈ 3 నెలలే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణంగా ఈ మూడు నెలలలో కనీసం అయిదారు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ 2019 సమ్మర్ సీజన్ లో ఒకే ఒక్క పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. అదే మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ముగ్గురు అగ్రశ్రేణి నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, పొట్లూరి వి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న” మహర్షి” చిత్రం.
ఈ ఒక్కటి తప్ప మిగిలిన ఏ పెద్ద స్టార్ సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం లేదు. మహేష్ బాబు 25వ సినిమా కావటం, ముగ్గురు ప్రముఖ నిర్మాతలు సంయుక్త నిర్మాణం జరపటం, స్టార్ హీరోలను స్టైలిష్ గా ప్రజెంట్ చేసే వంశీ పైడిపల్లి దర్శకుడు కావటం వంటి ప్రత్యేకతలతో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో ఏప్రిల్ 25 న వస్తున్న ” మహర్షి” కి సమ్మర్ సీజన్ లో సోలో రిలీజ్ తాలూకు అడ్వాంటేజ్ బాగా హెల్ప్ అవుతుంది. అందుకే 2019 సమ్మర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ అంచనాలు, ఆశలు అన్నీ ఈ సినిమా మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి.
ఇదిలా ఉంటే “మహర్షి” తరువాత ఆ స్థాయి పెద్ద సినిమా ఏదీ సమ్మర్లో రిలీజ్ కానప్పటికీ దానికి ముందు వెనుకగా మీడియం రేంజ్ అండ్ యబో మీడియం రేంజ్ సినిమాలు చాలా రిలీజ్ కు రెడీ అవుతూ సీజన్ అడ్వాంటేజ్ ని ఎంజాయ్ చేయబోపోతున్నాయి. ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
* మార్చి 29న ” సూర్యకాంతం” చిత్రం విడుదలవుతుంది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చి టీవీ యాంకర్ గా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల “సూర్యకాంతం” టైటిల్ రోల్ పోషిస్తున్నారు. నిర్వహణా సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి. ఇదే రోజున నిఖిల్ హీరోగా, లావణ్య త్రిపాటి హీరోయిన్ గా టీ ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న యాక్షన్ థ్రిల్లర్ “అర్జున్ సురవరం” కూడా రిలీజ్ అవుతుంది.
* ఏప్రియల్ 5 న కుటుంబ కలహాల నేపథ్యంలో రూపొందుతున్న కుటుంబ కథా చిత్రం” మజలి” రిలీజ్ అవుతుంది. పెళ్లయిన తరువాత నాగ చైతన్య- సమంత జంటగా నటిస్తున్న తొలి చిత్రం కావటం ఒక ప్రత్యేక ఆకర్షణ గా రూపొందుతున్న మజిలీ చిత్రానికి దర్శకుడు శివ నిర్వాణ.
* ఏప్రిల్ 12న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన “చిత్రలహరి” విడుదల కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆకృతి బ్యానర్
“ మైత్రి మూవీ మేకర్స్” ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
* ఏప్రియల్ 19న నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన “జర్సీ” చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.
* ఇక ఏప్రిల్ 25 న సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రం ” మహర్షి” అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఇలా మంచి అంచనాల మధ్యతరగతి చిత్రాలు, స్కై టచ్చింగ్ అంచనాల మహర్షి రిలీజ్ లతో 2019 ఏప్రియల్ మాసం గడిచిపోగా మండుటెండల మే నెలలో కూడా వినోదాల జల్లులు కురిపించడానికి చాలా సినిమాలు సిద్ధమవుతున్నాయి.
ఇంకా డేట్స్ ఖరారు కానప్పటికీ మే నెలలో సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన చిత్రం, భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్”, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన “కల్కి”, నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన” బేబీ ఎంత సక్కంగున్నావే”, తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్- కాజల్ జంటగా నటించిన ” సీత”, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తమన్నా టైటిల్ రోల్ పోషించిన ” దటీజ్ మహాలక్ష్మి” చిత్రాలు రిలీజ్ కు ముస్తాబవుతున్నాయి.
ఇవికాక నిర్మాణం చివరి దశలో ఉన్న, ఇంకా పేరు పెట్టని చాలా చిన్న చిత్రాలు ఈ హాట్ సమ్మర్ లో కూల్ రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నాయి.
మొత్తానికి 2019 సమ్మర్ ఒకే ఒక్క స్టార్ రిలీజ్ తో, దాదాపు డజనుకు పైగా మీడియోకర్ స్టార్స్ చిత్రాలతో సందడి చేయబోతుంది.
Let us hope and Wish All The Best to All of them”.
[youtube_video videoid=01cnjROvbbU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: