అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. హార్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి నుండి అమెరికాలో ప్రారంభంకానుందని… 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుందని కోన వెంకట్ ఇప్పటికే తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చారు కోన వెంకట్. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్ ఈసినిమాకు పనిచేస్తున్నట్టు తెలిపారు. బాబ్ బ్రౌన్ ఈ సినిమాకు పనిచేయడం చాలా గర్వంగా ఉంది.. తను చేసిన సినిమాల్లో ది వాల్, ప్రిడేటర్స్, ఐరన్ మ్యాన్, మిస్టర్ అండ్ మిస్ట్రస్ స్మిత్, ద డే ఆఫ్టర్ టుమారో మరియు మ్యాన్ అన్ ఫైర్ నాకు చాలా ఇష్టమైన సినిమాలు.. సాహో కు కూడా తనే యాక్షన్ డైరెక్టర్.. ఇప్పుడు మా సినిమాకు కూడా అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
https://www.instagram.com/p/BtcwLjpl9DU/?utm_source=ig_web_copy_link
కాగా ఇంకా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. . ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=JkbycyaSDD8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: