శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో.. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన చిత్రం ‘హుషారు’. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేశ్ తేజ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవలే రిలీజై మంచి విజయం సాధించింది. పెద్ద సినిమాలే నాలుగైదు వారాలు మించి ఆడని తరుణంలో చిన్న సినిమా అయినా 50 రోజులు పూర్తి చేసుకొని పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పొచ్చు ‘హుషారు’. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ పబ్లిసిటీతో జనాల్లోకి వెళ్లింది. మొదట తక్కువ థియేటర్లే దక్కినా.. తరువాత ఈ సినిమాకు వచ్చిన టాక్ వల్ల థియేటర్లు పెంచాల్సి వచ్చింది. అలా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా సక్సెస్ మీట్ లో మీడియాతో ముచ్చటించిన శ్రీహర్ష కొనుగంటి..‘‘సినిమాలు 50, 100 రోజులు ఆడటం కష్టమైన ఈ రోజుల్లో మా సినిమా 30 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది…చిత్ర పరిశ్రమ నుంచి పలువురు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు అని తెలిపాడు. తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. అక్కడా నన్నే దర్శకత్వం వహించమన్నారు కానీ… కుదరలేదన్నారు. ఇంకా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ… విజయ్ దేవరకొండతో తన తరువాత ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. మరి శ్రీహర్ష అయితే ప్లాన్ చేస్తున్నాడు…విజయ్ దేవరకొండ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందో?లేదో? చూద్దాం.
[youtube_video videoid=VylFLwvEuhY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: