ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ రోజు రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. కేవలం ఒక్క యాక్షన్ సీన్ మాత్రమే టీజర్లో కట్ చేశారు. వర్షంలో రాజశేఖర్ పై ఒక గ్యాంగ్ చేసే దాడిని ఈ టీజర్లో చూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో రాజశేఖర్ సరసన కథానాయికలుగా ఆదా శర్మ, నందిత శ్వేత నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని, శివాత్మిక సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, దాశరథి శివేంద్ర ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1983లో జరిగిన మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్నఈచిత్రంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
[youtube_video videoid=fa1pq43Ew1Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: