మణికర్ణిక సినిమా విషయంలో ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్, కంగన మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మణికర్ణిక సినిమాను దాదాపు 70 శాతం నేనే షూటింగ్ పూర్తి చేశానని…కానీ కంగన తనకిష్టమొచ్చినట్టు క్యారెక్టర్ల నిడివి తగ్గించడం, రీషూట్లు చెయ్యడం చేసిందనీ కంగనాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు క్రిష్. ఇక అక్కడ మొదలైన ఈ దుమారం చిలికి చిలికి పెద్ద తుఫాను లాగనే తయారైంది. ఈ వివాదంలో కొంత మంది కంగనకు మద్దతు తెలుపుతుండగా.. కొంత మంది క్రిష్ కు మద్దతు తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ వివాదంపై ప్రొడ్యూసర్ కమల్ జైన్ కూడా స్పందించారు. కంగనకు క్రెడిట్ ఇవ్వాలని మణికర్ణిక సినిమా క్రూ మొత్తం తీసుకున్న నిర్ణయం.. క్రిష్ మనసుకు కూడా అది తెలుసు.. తన ఆత్మ కూడా అదే నిర్ణయం తీసుకుంది.. కానీ సినిమా హిట్టయిన తరువాత క్రిష్ ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వడం… కాంట్రవర్సీ చేయడం చాలా షాకింగ్ గా ఉందన్నారు. అంతేకాదు… కంగన రనౌత్‌పై లేనిపోని ఆరోపణల చేయడం క్రిష్ కు తగదు… బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తుండటం చూసి సినిమా వసూళ్లను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు… తనకు అర్హత లేకున్నా సినిమా దర్శకత్వం టైటిల్ విషయంలో అనవసరంగా క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నించడం చాలా దారుణమన్నారు. ఒకవేళ తన వాదనలో ఏదైనా నిజం ఉంటే చట్టపరంగా మాపై చర్యలు తీసుకోవచ్చు అని కమల్ జైన్ అన్నారు. మొత్తానికి సినిమా ప్రొడ్యూసర్ కూడా కంగనకే సపోర్ట్ చేస్తున్నట్టు ఈ వ్యాఖ్యలను బట్టి అర్దమైపోయింది. ఇక నిర్మాతనే అలా మాట్లాడిన తరువాత పాపం క్రిష్ మాత్రం ఏం చేయగలడు..
[youtube_video videoid=LlHI_pFQSOA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: