దిల్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఆ సినిమా సక్సెస్ తో సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన నిర్మాత దిల్ రాజు. ఆయన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. తాజాగా ఎఫ్2 తో మరో భారీ విజయాన్ని అందుకున్నారు దిల్ రాజు. ఇక ఈ ఏడాది ప్రారంభంమే ఎఫ్ 2 మంచి జోష్ ఇవ్వగా.. ఇదే జోష్ తో నాలుగైదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు దిల్ రాజు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో 96 సినిమా కూడా ఒకటి. శర్వానంద్, సమంత జోడిగా తమిళ్ లో సూపర్ హిట్టయిన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు దిల్ రాజు. తమిళ్ లో డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… 15 ఏళ్ల కేరీర్ లో దిల్ రాజు తీస్తున్న తొలి రీమేక్ సినిమా అట ఇది. ఇటీవల విలేకర్ల సమావేశంలో పాల్గొన్న దిల్ రాజు స్వయంగా ఈ విషయం చెప్పారు. 15 ఏళ్ల కెరీర్‌లో నేను తీస్తున్న తొలి రీమేక్ ఇది… ‘96’ విషయంలో ఎన్ని నెగెటివ్ వార్తలు వచ్చినా తట్టుకోవడానికి రెడీగా ఉన్నా… దీనితో పాటు నాగచైతన్యతో ఓ సినిమా, నూతన దర్శకుడు సతీశ్‌తో ‘పలుకే బంగారమామేనా’ చేస్తున్నాని తెలిపారు.
ఇక 96తమిళంలో విడుదల కాకముందే.. దాని ట్రైలర్ చూసి ఫిదా అయిపోయిన దిల్ రాజు.. ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకోవడం గమనార్హం. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమాలోని ఎమోషన్, ఫీల్, లవ్ అన్నీ తమిళ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. మరి దిల్ రాజు అంత నమ్మకంతో తీయబోతున్న తెలుగు రీమేక్ ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో చూద్దాం..
[youtube_video videoid=RcnLjanyREI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: