వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్. గత ఏడాది `ఎం.ఎల్.ఎ`, `నా నువ్వే` చిత్రాలతో పలకరించిన కళ్యాణ్… ప్రస్తుతం `118`తో బిజీగా ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్ రూపొందిస్తున్నాడు. కళ్యాణ్ రామ్‌కి జోడీగా నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. మార్చి 1న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… అండర్ వాటర్ బ్యాక్‌డ్రాప్‌లో పిక్చరైజ్ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్ `118`కి హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. వెరైటీగా డిజైన్ చేసిన ఈ సీక్వెన్స్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందని… ఈ పోరాట ఘట్టం కోసం కళ్యాణ్ రామ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని మరీ నటించాడని తెలుస్తోంది. మరి… ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరపై ఎలా ఉంటుందో చూడాలంటే మరో నాలుగు వారాలు ఆగాల్సిందే.
[youtube_video videoid=jvKDc77javY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: