పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో కుటుంబ ప్రేక్షకులకు చేరువైన యువ కథానాయకుడు నాని. గత కొంతకాలంగా ట్రాక్ మార్చే ప్రయత్నం చేస్తున్నాడీ నేచురల్ స్టార్. గత ఏడాది విడుదలైన `కృష్ణార్జున యుద్దం`లో రాక్ స్టార్‌గానూ… `దేవదాస్`లో డాక్టర్‌గానూ కనిపించిన నాని… ప్రస్తుతం `జెర్సీ`లో మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `మనం` ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలోనూ నాని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ నాని డిఫరెంట్‌గా కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు… నాలుగు డిఫరెంట్ ఏజ్ లుక్స్‌లో దర్శనమివ్వనున్నాడట. 19 ఏళ్ళ టీనేజర్‌గానూ, పాతికేళ్ళ కుర్రాడిగానూ, 40 ఏళ్ళ మధ్య వయస్కుడిగానూ, 50 ఏళ్ళ వ్యక్తిగానూ… ఇలా నాలుగు విభిన్న ఛాయలతో నాని పాత్ర ఉంటుందట. ఈ నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో నాని మేకప్ మాత్రమే కాదు బాడీ లాంగ్వేజ్, మేకోవర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం.
హాలీవుడ్ మూవీ `ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమిన్ బటన్` ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుందని టాక్. నానికి జోడీగా కీర్తి సురేష్, ప్రియా ప్రకాష్ వారియర్, మేఘా ఆకాష్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశముందని తెలుస్తోంది. కాగా… త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.
[youtube_video videoid=bCITH3-eaRs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: