ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పాటలు ఆయన కలం నుండి జాలువారి ప్రాణం పోసుకున్నాయి. తెలుగు సినిమా పాటల్లో ఆయనది ప్రత్యేకమైన ముద్ర. తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న సాహితీ స్రష్ట. ఆయన ఎవరో కాదు సిరివెన్నెల సీతారామాశాస్త్రి. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 35 ఏళ్ళు అవుతున్న ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలను మనకు అందించారు. అలాంటి సిరివెన్నెలకు ఇన్నేళ్లకు అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో..సిరివెన్నెల సీతారామాశాస్త్రికి పద్మ శ్రీ అవార్డు దక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సిరివెన్నెలకు పద్మ శ్రీ వరించడంతో అటు తెలుగు ప్రరిశ్రమతో పాటు.. 35 ఏళ్ల నుంచి తన పెన్నుతో నిజాల్ని, భావోద్వేగాల్ని, ప్రేమను.. ఇంకా ఎన్నో భావాలకు పాటతో అర్ధం చెప్పిన సిరివెన్నెలకు ఇప్పటికైనా పద్మ శ్రీ దక్కినందుకు తెలుగు ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా పలువురు సినీ ప్రముఖలు ఆయనను కలిసి అభినందించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు మా ప్రసిడెంట్ శివాజీ రాజా, రైటర్ సాయి మాథవ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ పలువురు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. మరి ఇప్పటికైనా సిరివెన్నెలకు అవార్డు రావడం ఆనందించాల్సిన విషయమే.
[youtube_video videoid=_H0EY9kF2jA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: