సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2` బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఇప్పటికీ విడుదలైన అన్ని చోట్లా జైత్రయాత్ర సాగిస్తోంది. అంతేకాదు… ఈ సినిమాలో సంక్రాంతి అల్లుళ్ళుగా సందడి చేసిన విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచింది `ఎఫ్ 2`. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా కాసుల జల్లుతో కళకళలాడుతోంది. తాజాగా… ఈ సినిమా యు.ఎస్.బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ క్లబ్‌లో వెంకటేష్‌కిది మొదటి సినిమా కాగా… వరుణ్ తేజ్‌కి రెండో సినిమా. గతంలో `ఫిదా` ఈ ఫీట్‌ని సాధించగా… `ఎఫ్ 2` రిపీట్ చేసింది. మొత్తమ్మీద… 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో రెండేసి సినిమాలతో వరుణ్ వార్తల్లో నిలచాడు. ఇదివరకు సూపర్ స్టార్ మహేష్ బాబు (శ్రీమంతుడు, భరత్ అనే నేను), యంగ్ టైగర్ యన్టీఆర్ (నాన్నకు ప్రేమతో, అరవింద సమేత), యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (`బాహుబలి` సిరీస్)తో ఈ జాబితాలో `డబుల్ ధమాకా` ఇవ్వగా… ఇప్పుడు వారి సరసన వరుణ్ కూడా చేరిపోయాడన్నమాట. మున్ముందు… ఇలాంటి విజయాలు వరుణ్ ఖాతాలో మరిన్ని చేరాలని ఆశిద్దాం. కంగ్రాట్స్ టు యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ వరుణ్ తేజ్!
[youtube_video videoid=kx20Cf63drM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: