కింగ్ నాగార్జున కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలున్నాయి. వాటిలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మన్మథుడు’ (2002) ఒకటి. కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం… టాలీవుడ్ మన్మథుడుగా నాగార్జునకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. కాగా… ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ రూపుదిద్దుకోబోతోంది. ‘చి ల సౌ’ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం… ‘మన్మథుడు’లాగే… ‘మన్మథుడు 2’లో కూడా ఇద్దరు కథానాయికలు నటించనున్నట్టు తెలుస్తోంది. మార్చిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను… అత్యధిక భాగం పోర్చుగల్‌లో చిత్రీకరించనున్నట్టు సమాచారం. అక్కడే దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు… త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
[youtube_video videoid=N7vctB7DzsU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: