వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న ఈ తరం కథానాయికల్లో సమంత ఒకరు. గత ఏడాది `రంగస్థలం`, `మహానటి`, `యూ టర్న్` చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించిన ఈ చెన్నై చంద్రం… ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వాటిలో ఒకటి… తన భర్త నాగచైతన్యతో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `మజిలీ` కాగా… మరొకటి కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్. ఈ రెండు సినిమాలూ వేసవి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇదిలా ఉంటే… నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న `మిస్ గ్రానీ` రీమేక్‌కి ఆ మధ్య `ఓ బేబి` అనే టైటిల్‌ని, `ఎంత సక్కగున్నావె` అనే ట్యాగ్ లైన్‌ని అనుకుంటున్నారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం… టైటిల్‌లో చిన్న మార్పు చోటుచేసుకుంటోందని టాలీవుడ్ టాక్. కేవలం `బేబి` అనేది మాత్రమే టైటిల్‌గా ఉంటుందట. ట్యాగ్‌లైన్‌ని మాత్రం `ఎంత సక్కగున్నావె`నే ఉంచుతారని వినిపిస్తోంది. త్వరలోనే టైటిల్ పై ఫుల్ క్లారిటీ వస్తుంది. సమంతకి జోడీగా నాగశౌర్య నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=xGA69pFMWTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: